క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday 6 June 2012

వై.ఎస్.ఆర్ మరణం వెనుక పుట్టల కొలది కుట్రలు : ఇదిగో ఆధారాలు


(సాక్షి సౌజణ్యంతో)
2009 ,సెప్టెంబరు, 2 న చిత్తూరు రచ్చ బండ కార్యక్రమానికి బయలు దేరిన వై.ఎస్. చాపర్ క్రాష్ తో మరణించడం విదితమే .

ఈ దుస్సంఘఠణకు సరిగ్గా పదిహేను రోజుల పూర్వమే వై.ఎస్. ఎక్కిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపాలు. గాలిలోకి ఎగిరిన నిమిషాల్లో ఎమెర్జెన్సి ల్యేండింగ్ చెయ్యాల్సిన పరిస్థితి వైఎస్.తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.

విచారణ సంస్థలు తేల్చినవి:
మేఘాలు -గాలులు -ఇందన సరఫరా మార్గంలో లోపం - రెండు ఇంజిన్లూ ఒకేసారి నిలిచి పోవడం -రోటర్ తిరగలేదు - టర్బైన్లో లోపం -చివరికి ఆ చాపర్ గాలిలో ఎగిరే పరిస్థితిలోనే లేదన్నారు. (ఏయిర్ వర్తినెస్)

హెలికాప్టర్ కూలిపోవటానికి ముందు అరగంట పాటు ఏం జరిగింది అనేది.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను వింటే తెలిసిపోతుంది. కానీ.. అందులో కేవలం ‘కీలకమైన చివరి 6 నిమిషాల’ గురించే దర్యాప్తు సంస్థలు ప్రస్తావిస్తున్నాయి.

అవి కూడా పైలట్ - కో పైలట్ మాటలు మినహా.. మరేమీ లేదంటున్నారు. మిగతా 24 నిమిషాల సంభాషణలేమిటనేది ఇప్పటికీ ‘రహస్యమే’! అదేమంటే.. 6 నిమిషాలు మాత్రమే రికార్డయిందని.. మిగతాది సరిగా రికార్డు కాలేదని బుకాయిస్తున్నారు.

కాక్పిట్ వాయిస్ రికార్డరేమన్నా కాంగ్రెస్ పార్టి నేతా? లేక దానికి అమ్నీషియా వ్యాధి ఏమన్నా సోకిందా?

అసలు సీవీఆర్‌లో రికార్డయిన సంభాషణలు బయటపెట్టటానికి ఎవరికైనా ఉన్న అభ్యంతరం ఏమిటి?

అసలు సీవీఆర్‌లో ఏముంది? హెలికాప్టర్ డాటా రికార్డర్ ఏం చెప్తోంది? అన్ని విషయాలనూ పారదర్శకంగా బయటపెట్టొచ్చు కదా? ఎందుకంత రహస్యం?

ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు.. తటస్థమైన అంతర్జాతీయ వైమానిక ఇంజనీరింగ్ నిపుణులతో దర్యాప్తు చేయించి నిజం ఏమిటో నిరూపించొచ్చు కదా?

వైఎస్ హెలికాప్టర్ దుర్ఘటనకు ముందూ వెనుకా జరిగిన ఘటనల పరిణామ క్రమం.. ఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు, ఉన్నతాధికారుల వ్యవహార శైలి.. ఘటనపై దర్యాప్తు సంస్థలు స్పందించిన తీరు.. అవి తమ దర్యాప్తు నివేదికల్లో పేర్కొన్న అంశాలు.. అన్నింటిపైనా నిశిత పరిశీలకులు, వైమానిక ఇంజనీరింగ్ నిపుణులు, సామాన్య ప్రజలు అనేకానేక సందేహాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వాటిలో ముఖ్యమైన వాటిని పరిశీలిస్తే...

కొత్త చాపర్ ఉండగా పనికి రాదని మూలన పడేసిన బెల్ 430 లోనే ఎందుకు పయణింప చేసారు? చాపర్ మాయమైందన్న కొంత సమయానికే కొత్త చాపర్ ఎలా గాలిలోకి ఎగిరింది?

బేగంపేట విమానాశ్రయంలో పాత చాపర్ని ఉంచిన హ్యాంగర్‌కు ఎలాంటి భద్రతా లేదు. సాధారణంగా.. ముఖ్యమంత్రి వంటి వీవీఐపీ ప్రయాణించే హెలికాప్టర్‌కు ఎలాంటి విద్రోహం జరగకుండా చూసేందుకు సీఐఎస్‌ఎఫ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల భద్రత కల్పించాల్సి ఉంటుంది.

(ఇప్పటికీ ఈ ఏర్పాటు లేదని - ఒక పైలట్ తన ఫ్రెండ్ అతని లవరుతో జాలి రైడ్ వెళ్ళాడని ఏ.బి.ఎన్ ఒక కథనాన్ని ప్రసారం చేసిన మాట గుర్తుకు తెచ్చుకొండి)

బేగం పెట్ విమానాశ్రయానికి వచ్చిన వై.ఎస్.కు ‘బెల్ 430’ కనిపించింది. ఇది చూసి వైఎస్ ఆశ్చర్యపోయారు. ‘ఇదేంటి? ఇక్కడ ఇదెందుకుంది? అగస్టా ఏమైంది?’ అని అడిగారు.

అధికారులు ‘అగస్టా సర్వీసులో ఉంది.. అందుకే దీనిని సిద్ధం చేశాం’ అని వాళ్లు బదులిచ్చారు. ‘దీనితో ఇబ్బందేమీ లేదు కదా?’ అని వైఎస్ అడిగారు. ‘ఏమీ లేదు.. అంతా బాగుంది’ అని వాళ్లు భరోసా ఇచ్చారు.

వారి మాటను విశ్వసించిన వైఎస్ అందులో ప్రయాణమయ్యారు. ఉదయం 8:38 గంటలకు బయల్దేరిన ‘బెల్ 430’ సరిగ్గా 40 నిమిషాల తర్వాత అదృశ్యమైపోయింది. రాడార్‌లో కనిపించకుండా పోయింది. గంటలు గడుస్తున్నా చేరాల్సిన గమ్యస్థానం చేరలేదు.

ఇది జరిగిన గంటలోనే ‘అగస్టా’ బేగం పెట్ చేరుకుంది. ఇదెలా సాధ్యం. ఇది యాద్రుచికమా? కుట్ర పూరితమా? గంటాలో అగస్తా సర్వీసు పూర్తి చేసుకుంటుందంటే వై.ఎస్. పయణాన్ని ఎందుకు గంట పాటు వాయిదా వెయ్యలేదు?

సీఎం ప్రయాణానికి సిద్ధంగా లేని చాపర్.. ఆ తర్వాత ఒకటి, రెండు గంటల్లోనే ఎలా సిద్ధమయ్యింది? అసలేం జరిగిందని ఆరా తీస్తే.. పైలట్లు సెలవులో ఉన్నారన్న సాకుతో ‘అగస్టా’ను బయటకు తీయలేదన్న విషయం బయటపడింది.

సి.ఎమ్ కార్యక్రమం అంటే ఆజామాయిషి కదు కనీశం పది రోజుల ముందే ఖరారవుతుంది. ప్రోగ్రామ్ ఉందని తెలిసి తెల్సి పైలట్లకు సెలవులు ఎలా ఇచ్చారు? ఎవరిచ్చారు?

‘అగస్టా’ కెప్టెన్ బొరాన్ గుప్తా.. వైఎస్ ప్రయాణానికి కేవలం 2 రోజుల ముందే సెలవుపై వెళ్లారు. కో పైలట్లు మధువర్మ, వికాస్‌లు కూడా విధుల్లో లేరు. వీరందరినీ ఒకేసారి సెలవుపై పంపించారా? అలా ఎందుకు చేశారు? ఎవరు చేశారు? ‘అగస్టా’ సర్వీసింగ్‌లో ఉందని, ఆ రోజు మధ్యాహ్నమే వచ్చిందని నమ్మించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?

ముఖ్యమంత్రి వంటి వీవీఐపీల భద్రతా ప్రమాణాల ప్రకారం.. సీఎం స్థాయిలోని వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తే.. ముందుగా దాని వెనుక ఏదైనా విద్రోహ చర్య ఉన్నదా? లేదా? అని తేల్చటం ప్రభుత్వాల విధి. కానీ.. వైఎస్ మరణం విషయంలో ఈ ప్రమాణాలను ఏ మాత్రం పాటించలేదు. పావురాలగుట్ట మీద హెలికాప్టర్ శకలాలు, ఛిద్రమైన మృతదేహాలు కనిపించిన కొద్ది సేపటికే.. ‘హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణించారు’ అని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, అటు కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించేశారు.

దుర్ఘటనను చివరికి పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా.. ప్రమాదం అనే పేర్కొన్నారు.

ఒక సాధారణ వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లో చనిపోతేనే.. అనుమానాస్పద మరణంగా నమోదు చేసి ఆ కోణంలో దర్యాప్తు చేసే పోలీసులు.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరణాన్ని ప్రమాదమేనని తక్షణమే ఎలా సూత్రీకరించారు? కనీసం ప్రాథమిక స్థాయి దర్యాప్తు కూడా చేయకుండానే.. ఘటనా స్థలిని క్షుణ్నంగా పరిశోధించకుండానే.. కనీసం మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించక ముందే.. ‘ప్రమాదంలో చనిపోయార’ని అందరూ ఎలా నిర్ణయానికి వస్తారు? అంటే.. ఇది ప్రమాదమేనని ప్రజలను నమ్మించటానికి మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నారా? తర్వాత హడావుడిగా పూర్తిచేసిన దర్యాప్తుల్లోనూ ‘ఏం తేల్చాలో’ ముందుగానే నిర్దేశించారా?

ఈఎల్‌టీ పది రోజుల తర్వాత ఎలా దొరికింది?

హెలికాప్టర్ ఏవైనా ఇబ్బందులు వచ్చి అత్యవసరంగా నేలకు దిగినా.. ఏదైనా దుర్ఘటనకు లోనైనా.. అది ఎక్కడుందో తెలియజేసే ‘ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్‌మిటర్’ (ఈఎల్‌టీ).. ఈ హెలికాప్టర్‌లో ఉందా? లేదా? అన్నది పది రోజుల పాటు అంతుచిక్కని మిస్టరీగా ఉంది. దుర్ఘటనకు లోనైన వెంటనే ఈఎల్‌టీ క్రియాశీలమై (యాక్టివేట్ అయ్యి) సంకేతాలు పంపితే.. శాటిలైట్ ద్వారా వాటిని గుర్తించి.. ఘటనా స్థలాన్ని కనిపెడతారు.

కానీ.. సైనిక సిబ్బంది, దర్యాప్తు అధికారులు పది రోజుల పాటు గాలించినా.. ఘటనా స్థలంలో ఈఎల్‌టీ దొరకలేదు. పది రోజుల పాటు వేల సంఖ్యలో వచ్చిన ప్రజలకు కూడా అది కనిపించలేదు. పది రోజుల తర్వాత.. దర్యాప్తు బృందంలోని ఒక అధికారి.. ఈఎల్‌టీ దొరికిందని ప్రకటించారు.

అన్ని రోజులు వాళ్ల కళ్లబడకుండా అది ఎలా దాక్కుంది? హెలికాప్టర్‌లో ఈ ఈఎల్‌టీ పనిచేయలేదని చెప్తున్నారు. అందువల్లే.. హెలికాప్టర్ అదృశ్యమైన 24 గంటల వరకూ దాని జాడను గుర్తించలేకపోయారు. దానికి కారణం.. ఈఎల్‌టీ ఫ్రీక్వెన్సీని నిర్ణీత ప్రమాణాల మేరకు అప్‌గ్రేడ్ (స్థాయిని పెంచటం) చేయలేదని ఆ తర్వాత డీజీసీఏ నివేదికలో బయటపెట్టారు.

2005లో విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఈఎల్‌టీని అప్‌గ్రేడ్ చేయలేదని, ఆ విషయాన్ని ఎయిర్-వర్తీనెస్ బృందం గుర్తించలేదని డీజీసీఏ తప్పుపట్టింది. మరి దీనికి ఎవరిని బాధ్యుల్ని చేశారు?

హెలికాప్టర్ వేగం.. ఎత్తు ఎందుకు తగ్గిపోయింది?

హెలికాప్టర్ పైలట్లు విజువల్ ఫ్లైట్స్ రూల్స్ (వీఎఫ్‌ఆర్) నుంచి ఇన్‌స్ట్రుమెంటల్ ఫ్లైట్ రూల్స్ (ఐఎఫ్‌ఆర్)కు మారటం అసాధారణమేమీ కాదు. ఇలా మారినంత మాత్రాన అది.. పైలట్, కోపైలట్‌లు చాపర్‌ను నడిపే సామర్థ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది?

వాతావరణం బాగోలేనప్పుడు.. పైలట్లు ఐఎఫ్‌ఆర్‌కు మారటం వింతేమీ కాదు. అలా చేయటం వల్ల చాపర్ ఆటోపైలట్ (తనకు తానుగా యాంత్రికంగా నడవటం)లోకి వెళ్తుంది. వీఎఫ్‌ఆర్‌కు అనుమతి ఇచ్చినప్పటికీ.. పైలట్లు ఐఎఫ్‌ఆర్‌కు మారారని డీజీసీఏ తన నివేదికలో వింత వాదన చేస్తోంది.

ఈ వాదన తర్కబద్ధంగా లేదు. కర్నూలు సమీపంలో మబ్బులు పట్టివున్న వాతావరణంలోకి ప్రవేశించాక.. చాపర్ వేగాన్ని 140 నాట్స్ నుంచి 40 నాట్స్‌కు ఎందుకు తగ్గించారు?

అసలు.. 5,500 అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సిన హెలికాప్టర్.. నల్లమల అడవులపై నుంచి వెళ్తున్నప్పుడు 2,000 అడుగుల ఎత్తుకు దిగి ప్రయాణించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆ ఎత్తు నుంచి కూడా ఒక్కసారిగా మరో 1,000 అడుగులు కిందకు దిగటానికి కారణమేమిటి?

ఇలా నియంత్రణ లేకుండా హెలికాప్టర్ కిందకు దిగిపోవటానికి కారణాలేమిటన్నది డీజీసీఏ నివేదిక చెప్పలేదు.
( బహుసా ఇందన సరఫరాలోని లోపం -రీండు ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడం ఇందుకు కారణమై ఉండొచ్చు)

ఆ పరిస్థితుల్లోనే చాపర్ నియంత్రణ లేకుండా పడిపోతుందని అంటున్నారు. అలా పడిపోతున్నప్పటికీ.. ప్రధాన రోటర్ తిరుగుతూనే ఉంటుందని, చాపర్ కొంత దూరం ప్రయాణించటానికి సాయం చేస్తుందని వివరిస్తున్నారు.

కానీ.. వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ విషయంలో ఏ విభాగమూ పనిచేసినట్లు కనిపించటం లేదు. అది పావురాల గుట్ట శిఖరాన్ని నిమిషానికి 4 కిలోమీటర్ల వేగంతో ఢీ కొట్టింది. ఈ వేగంలో ఎవరైనా ప్రాణాలతో బయటపడే అవకాశాలు శూన్యం.

ఎయిర్‌వర్తీనెస్‌పై డీజీసీఏ మాటల్లో ఏది నిజం?

అసలు.. బెల్ 430 హెలికాప్టర్ ఎయిర్‌వర్తీనెస్‌పైనే తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై స్వయంగా డీజీసీఏనే మూడు రకాలుగా మాట మార్చింది. ఈ చాపర్‌కు ఇచ్చిన ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్‌కు సంబంధించిన వివరాలు, తేదీలను డీజీసీఏ తన వెబ్‌సైట్‌లో పలుమార్లు మార్చింది.

( అలా మార్చినప్పుడల్లా ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచి ఉంటే ఎంత భావుండేది - ఇప్పడికీ ఎవరైనా ఇదివరకే తీసి బద్రపరచి ఉంటే సాక్షి వాటిని కలెక్ట్ చేసి ప్రచురించవచ్చు)

ఈ బెల్ చాపర్‌కు 2005 జూలై 5వ తేదీన ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేశామని.. అది 2007 జూలై వరకూ చెల్లుతుందని డీజీసీఏ తొలుత పేర్కొంది. ఈ విషయాన్ని ‘టైమ్స్ నౌ’ ఇంగ్లిష్ న్యూస్ చానల్ 2009 సెప్టెంబర్ 2వ తేదీ నాడే (సాయంత్రం 6:41 గంటలకు) వార్తా కథనంలో వెల్లడించింది.

కానీ.. రెండు రోజుల్లోనే డీజీసీఏ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను మార్చేసింది. ఈ బెల్ చాపర్‌కు ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్‌ను 2006 డిసెంబర్ 5న జారీ చేయటం జరిగిందని.. అది 2010 డిసెంబర్ 5వ తేదీ వరకూ చెల్లుతుందని పేర్కొంది.

ఈ విషయాన్ని ఐఏఎన్‌ఎస్ వార్తా సంస్థ 2009 సెప్టెంబర్ 8వ తేదీన వెల్లడించింది. ప్రస్తుతం డీజీసీఏ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ చాపర్ ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ 2009 డిసెంబర్ వరకూ చెల్లుబాటవుతుంది. కానీ.. దుర్ఘటనపై డీజీసీఏ ఇచ్చిన దర్యాప్తు నివేదికలో.. ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్‌ను 2008 డిసెంబర్‌లో జారీ చేశారని, అది 2010 డిసెంబర్ వరకూ చెల్లుతుందని పేర్కొంది. వీటన్నింటిలో ఏది నిజం? ఎందుకు ఇన్నిసార్లు మాట మార్చారు? ఎందుకు ఇన్ని తేదీలు ముందుకు జరిపారు?

ఘటనాస్థలానికి భద్రత ఏదీ?

ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినా, ఎక్కడైనా కాస్త సంచలనాత్మక ఘటన జరిగినా.. పోలీసులు ఆ ప్రదేశాన్నంతటినీ తమ ఆధీనంలోకి తీసుకుంటారు. సామాన్యులెవరూ ఆ దరిదాపుల్లోకి రాకుండా ఆంక్షలు విధిస్తారు. ఘటనా స్థలంలో లభించే ఆధారాలు ఎంత విలువైనవో.. దర్యాప్తు అధికారులకు తెలియనిది కాదు. కానీ.. నాటి సీఎం వైఎస్ మరణించిన ఘటనా స్థలం విషయంలో ఏం చేశారు? మృతదేహాలను అక్కడి నుంచి తరలించాక.. ఆ ప్రదేశంతో తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. దుర్ఘటన జరిగిన పావురాలగుట్టకు అదే రోజు నుంచి వందలు, వేల సంఖ్యలో ప్రజలు వెల్లువలా వచ్చిపోతూనే ఉన్నారు. ఘటనా స్థలంలో తమకు కనిపించిన వస్తువులను పట్టుకుపోతూనే ఉన్నారు.

కానీ.. వారిని నియంత్రించేందుకు, ఆధారాలు చెరిగిపోకుండా చూసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. దుర్ఘటనలో చనిపోయిన వైఎస్ వాచీని పార్నపల్లెకు చెందిన జనార్దన్‌రెడ్డి, రామాంజనేయ అనే వ్యక్తులు పట్టుకుపోయి.. తిరిగి 6వ తేదీన పోలీసులకు అందించటమే దీనికి నిదర్శనం. వైఎస్, ఇతర ప్రయాణికులకు చెందిన అనేక వస్తువులు, సూట్‌కేస్ ఐదో తేదీ వరకూ అక్కడే పడున్నాయి. వైఎస్, వెస్లీ, సుబ్రహ్మణ్యంలకు చెందిన సెల్‌ఫోన్లను కర్నూలు జిల్లా అధికారులు 8న స్వాధీనం చేసుకున్నారు. దుర్ఘటన జరిగిన పది రోజుల తర్వాత.. 13వ తేదీన పావురాలగుట్టకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందం ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ డాటాకార్డ్, వెస్లీకి చెందిన గుర్తింపు కార్డులు కనుగొన్నారు. ఇన్ని రోజుల తర్వాత దర్యాప్తు అధికారులు తీరికగా అక్కడికి వస్తే.. ఏ ఆధారాలు లభిస్తాయి? సీఎం స్థాయి వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లో చనిపోతే.. ఘటనా స్థలం పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించగలిగారు?

వీఓఆర్‌లు రెండూ ఎలా విఫలమయ్యాయి?

చాపర్‌లోని ఇంజన్ కంట్రోల్ యూనిట్ (ఈసీయూ) నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. చాపర్‌లో బిగించివున్న రెండు వీహెచ్‌ఎఫ్ ఓమ్ని రేంజ్ (వీఓఆర్)లు ఒకేసారి విఫలమయ్యాయి. పైలట్, కో-పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోళ్లతో (ఏటీసీలతో) నిరంతరం సంప్రదింపులు జరపటానికి, ప్రయాణించాల్సిన మార్గం గురించి తెలుసుకోవటానికి వీఓఆర్‌లు దోహదం చేస్తాయి. ఇవి రెండూ ఒకేసారి ఎలా విఫలమయ్యాయి? దానికి కారణమేమిటి?


రెండు ఇంజన్లూ ఎలా ఆగిపోయాయి
చాపర్‌లోని ఇంజన్లు రెండూ ఒకేసారి విఫలమవటం అనూహ్యమైన విషయం. దీనిపై డీజీసీఏ నివేదిక ఎందుకు మౌనం దాల్చింది. అసలు.. వీవీఐపీ ప్రయాణానికి ఈ చాపర్‌కు ఎయిర్-వర్తీనెస్ (గాలిలో ప్రయాణించే సామర్థ్యం) లేదని ఈ నివేదిక చెప్తోంది. అంతకుముందలి ప్రయాణంలో చాపర్‌లోని మొదటి ఇంజన్.. నిర్దేశిత ఉష్ణోగ్రతను మించిపోయిందని, ఆ ఫలితంగా టార్క్ కూడా పెరిగిపోయిందని పేర్కొంది. ఈ లోపం.. చాపర్‌లోని పానల్ బోర్డుపై ఒక ఇండికేటర్ రూపంలో పైలట్ దృష్టికి వస్తుంది. అయినప్పటికీ.. చాపర్ దుర్ఘటనకు ఇది కారణం కాకపోవచ్చని డీజీసీఏ పేర్కొంది.



ఇంధన సరఫరాలో లోపమే కారణమా?
వాతావరణం, ఇంధన సరఫరాలో లోపం.. హెలికాప్టర్ కూలిపోవటానికి ఈ రెండూ కారణాలుగా డీజీసీఐ చెప్తోంది. కానీ.. ఇంధన సరఫరాలో లోపం తలెత్తినప్పటికీ.. అంటే ఇంధన సరఫరా పూర్తిగా కట్ అయినప్పటికీ.. చాపర్ కనీసం మరో 20 నిమిషాల పాటు ఎగురుతూనే ఉండగలదు. ఇంధన సరఫరాలో లోపాన్ని పైలట్లు 9:21 గంటలకు గుర్తించారని, చాపర్ 9:27 గంటలకు కూలిపోయిందని డీజీసీఏ నివేదికలో పేర్కొన్నారు. అంటే.. ఇంధన సరఫరా ఆగిపోయిన ఆరు నిమిషాల్లోనే చాపర్ కూలిపోయినట్లు చెప్తున్నారు. అదెలా సాధ్యమవుతుంది?



వెస్లీ పిస్టల్‌లోని బుల్లెట్లు ఏమయ్యాయి?
ముఖ్యమంత్రి ప్రధాన భద్రతా అధికారి వెస్లీకి చెందిన పిస్టల్ అత్యంత ఆధునికమైనది. ఎప్పుడూ లోడ్ చేసి, సిద్ధంగా ఉంటుంది. ఆయన వద్ద మొత్తం 13 బులెట్లు ఉంటాయి. కానీ.. ఘటనా స్థలం నుంచి కేవలం 7 బులెట్లే దొరికినట్లు సీబీఐ అధికారులు చెప్తున్నారు. మరి మిగతా 6 బులెట్లు ఏమైనట్లు? ప్రమాద స్థలంలో ఖాళీ మేగజీన్‌తో దొరికిన తుపాకీని లేబొరేటరీకి పంపించగా.. ఈ తుపాకీ నుంచి ఫైరింగ్ జరిగిందనటానికి ఆనవాళ్లుగా రసాయనిక అవశేషాలు ఉన్నాయని సెంట్రల్ ఫోరెన్సిక్ సెన్సైస్‌కు చెందిన సీనియర్ సైంటిస్ట్ అధికారి చెప్పినట్లు సీబీఐ తన నివేదికలో పేర్కొంది.

ఇదిలావుంటే.. హెలికాప్టర్ అవశేషాల్లో ఎగ్జిట్ డోర్‌కు ఒక రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. మొదట ఇది బులెట్ వల్ల అయిన రంధ్రంగా భావించినా.. ఆ తర్వాత అది కాదని తేల్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ పిస్టల్.. వెస్లీకి 2009 జూన్ 21న ఇచ్చారని.. దుర్ఘటన జరిగే ముందు వరకూ దానిని ఫైర్ చేయలేదని సీబీఐ పేర్కొంది. మరి వెస్లీ వద్ద ఉండాల్సిన మరో 6 బులెట్లు ఏమైపోయాయనే అంశంపై సీబీఐ ఎందుకు దృష్టి సారించలేదు? అంత ముఖ్యమైన అంశాన్ని ఎందుకు తేలికగా విస్మరించింది?


ఒకేసారి ఇన్నిసమస్యలెలా వచ్చాయి?
ఏ యంత్రంలోనైనా ఒక్కోసారి ఒక్కో లోపం తలెత్తటం సాధారణమే. అయితే.. ముఖ్యమంత్రి వంటి వీవీఐపీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ప్రతి ప్రయాణానికీ ముందు క్షుణ్నంగా పరిశీలించి, పరీక్షించి, ఏ సమస్యకూ ఆస్కారం లేకుండా చూసుకుని కానీ.. ప్రయాణానికి సిద్ధం చేయరు. కానీ.. వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్‌లో అనేకమైన లోపాలు.. అది కూడా చాలా పెద్దవి.. ఒకేసారి తలెత్తాయని చెప్తున్నారు. వీఓఆర్‌లు రెండూ ఏకకాలంలో విఫలమవటం.. ఆ వెంటనే ఇంధన సరఫరా వ్యవస్థలో లోపం.. దానివెంబడి ఇంజన్లు రెండూ ఒకేసారి ఆగిపోవటం.. ఆ వెంటనే రోటర్ తిరగకుండా నిలిచిపోవటం, టర్బైన్ ఆగిపోవటం.. ఇన్ని సమస్యలు ఏకకాలంలో ఎలా ఉత్పన్నమయ్యాయి? ఇంజన్లు, మెయిన్ రోటార్ నిలిచిపోవటంతో.. చాపర్ నిమిషానికి 14,200 అడుగుల వేగంతో కిందకు పడిపోయింది.

మరో మాటలో చెప్పాలంటే.. చాపర్ ఒక విసిరేసిన రాయిలాగా.. 14 సెకన్లలో నేలకూలింది. అంత వేగంగా కూలిపోయినా కూడా.. అలాగే నిలువుగా నేలమీద పడి, 150 అడుగులు దూసుకుపోయి, మంటల్లో చిక్కుకుందని చెప్తున్నారు. ఆ తర్వాత ఈఎల్‌టీ పనిచేయలేదని.. సీవీఆర్ కూడా దెబ్బతిన్నదని పేర్కొంటున్నారు. ఇన్ని సాంకేతిక సమస్యలు ఒక్కసారిగా ఎలా తలెత్తుతాయి?


సీవీఆర్‌లో ఆ 6 నిమిషాలే ఎందుకు రికార్డయ్యాయి?
హెలికాప్టర్‌లోని కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) నుంచి సేకరించిన సంభాషణల గురించి డీజీసీఏ అక్కడక్కడా రెండు ముక్కలు ప్రస్తావించింది కానీ.. ఆ సంభాషణ పూర్తి పాఠాన్ని తన నివేదికలో వెల్లడించలేదు. ఇది చాలా అసహజంగా ఉందని వైమానిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. బెల్ 430 చాపర్‌లోని సీవీఆర్ మాగ్నటిక్ టేప్‌లో మొత్తం 32 నిమిషాల నిడివి గల సంభాషణలు రికార్డవుతాయి. దీనికి సంబంధించి చాపర్‌లోని పైలట్ క్యాబిన్‌లో ఒక మైక్రోఫోన్, పాసింజర్ క్యాబిన్‌లో ఒక మైక్రో ఫోన్ ఉంటాయి.

ఇవి చాలా శక్తివంతమైనవి. పాసింజర్ క్యాబిన్ విండ్ షీల్డ్ (అద్దం)ను తుడిచే వైపర్ శబ్దాన్ని కూడా ఇవి రికార్డు చేయగలవు. 2008 అక్టోబర్ 3వ తేదీన బేగంపేట విమానాశ్రయం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు బయల్దేరిన ‘బెల్ 430’ హెలికాప్టర్ ఒకటి.. ఖమ్మం జిల్లాలో వెంకటాపురం సమీపంలో ఛత్తీస్‌గడ్ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలోని కోడిజుట్టు కొండపై కూలిపోయింది. మూడు నెలల తర్వాత దీని శకలాలను గుర్తించి.. సీవీఆర్‌ను వెలికి తీసి అందులోని సంభాషణలను విన్నారు.

కూలినప్పుడు సీవీఆర్ స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ.. అందులో మొత్తం 32:28 నిమిషాల నిడివి గల సంభాషణలు ఉన్నట్లు ఇదే డీజీసీఏ ఆ ప్రమాదంపై ఇచ్చిన నివేదికలో వివరించింది. రికార్డయిన పైలట్, కోపైలట్ సంభాషణలను కూడా ఏ నిమిషానికి ఏం మాట్లాడారు అన్నదానిని వివరంగా ఇచ్చింది. రోటార్ ఆర్‌పీఎం శబ్దంలో హెచ్చుతగ్గులు, ప్రయాణం ఆద్యంతం విండ్ షీల్డ్ వైపర్ పనిచేస్తున్న శబ్దంతో పాటు.. చిట్టచివరిగా 32:28 నిమిషాల వద్ద హెలికాప్టర్ దేనినో ఢీకొన్న శబ్దం అన్నీ స్పష్టంగా రికార్డయినట్లు ఆ నివేదికలో వెల్లడించింది.

వైఎస్ ప్రయాణించిన ‘బెల్ 430’ హెలికాప్టర్‌లో కూడా అదే సామర్థ్యమున్న సీవీఆర్ ఉంది. దానిని పూర్తిగా వింటే.. దుర్ఘటన జరగటానికి ముందు 32 నిమిషాల పాటు.. చాపర్‌లో ప్రయాణిస్తున్న వారి మధ్య ఏ సంభాషణలు జరిగాయి అన్నది తెలుస్తుంది. దీనిద్వారా.. అసలు ఏం జరిగి ఉంటుందనే అంశంపై నిర్దిష్టమైన అంచనాకు రావచ్చు. ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు.. ముఖ్యమంత్రి ఎలా స్పందించారు? ఆయన ముఖ్య కార్యదర్శి ఎలా స్పందించారు? సీఎం ప్రధాన భద్రతాధికారి ఎలా స్పందించారు? అన్నది తెలుసుకోవచ్చు. కానీ.. 32 నిమిషాల నిడివిగల సీవీఆర్‌లో కేవలం ఆరు నిమిషాల నిడివి గురించే.. అది కూడా పైలట్ - కో పైలట్‌ల మధ్య సంభాషణ గురించే.. అందులోనూ చాలా స్వల్పంగానే డీజీసీఏ నివేదిక ప్రస్తావించింది.

ఆ ఆరు నిమిషాల సమయాన్నీ పైలట్లు.. ఫ్లైట్ మాన్యువల్ వెదుకుతూ వృథా చేశారని, కాప్టర్ ఎలా ప్రయాణిస్తోందనేది పట్టించుకోలేదని మాత్రమే చెప్పింది. అందుకే ఆ ఆరు నిమిషాలు కీలకంగా అభివర్ణించింది. పోనీ.. ఆ ఆరు నిమిషాల సంభాషణ పూర్తి పాఠమైనా వెల్లడించారా? అంటే అదీ లేదు! మరి.. సీవీఆర్‌లో మిగతా 26 నిమిషాల సంభాషణల సంగతి ఏమిటంటే.. అవేవీ సరిగా రికార్డు కాలేదని చెప్తున్నారు.

దుర్ఘటన జరగటానికి నాలుగు నిమిషాల ముందు.. కో పైలట్ ‘గో అరౌండ్’ అని పలుమార్లు చెప్పటమే చివరిగా రికార్డయినట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ ‘ప్రమాదం’లో పడినప్పుడు పాసింజర్ క్యాబిన్‌లో ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఆయనతో పాటు ఉన్న ఉన్నతాధికారులు కానీ.. ఏమీ మాట్లాడలేదా? మౌనంగానే ఉన్నారా? అంతటి ఆందోళనకర పరిస్థితుల్లో అరగంట పాటు ఈ ముగ్గురూ మాట్లాడకుండా ఉండే అవకాశమే లేదు.. మరి ఏం జరిగింది? సీవీఆర్‌లో శబ్దాలు మల్టీ ట్రాక్‌పై రికార్డవుతాయి. వాటిలో పాసింజర్ క్యాబిన్ నుంచి రికార్డయిన మాటలను తొలగించేందుకు టాంపరింగ్ జరిగిందా? అది కాదంటే.. అప్పటికే వాళ్లు ముగ్గురూ ఇక మాట్లాడలేని పరిస్థితి (ఇన్‌కెపాసిటేటెడ్)లో ఉన్నారా?



విద్రోహచర్యకు ఆస్కారం లేదా?
క్షుణ్నంగా తనిఖీ చేసి బయల్దేరినట్లు చెప్తున్న హెలికాప్టర్‌లో.. ఏ విద్రోహ చర్యా లేకుండానే ఇన్ని సమస్యలు పుట్టుకొచ్చాయా? చాపర్‌లో ఇంధన సరఫరా లోపం ఎప్పుడు తలెత్తుతుందంటే.. సంబంధిత వ్యవస్థను సుదీర్ఘ కాలం పాటు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల కానీ, లేదంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సరిచేసే వారు ఆ వ్యవస్థలో ఏదైనా పొరపాటు చేసినప్పుడు కానీ తలెత్తుతుంది. వైమానిక ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం.. ఇంధన ట్యాంకు మూడు చాంబర్లుగా విభజించి ఉంటుంది. హెలికాప్టర్ లోడ్‌ను సమానంగా భరించే రెండు ఇంజన్లు.. చెరి సమానంగా ఇంధనాన్ని తీసుకుంటాయి.

ఒక చాంబర్ పూర్తయిన తర్వాత మరొక చాంబర్ నుంచి ఇంధనం సరఫరా అవుతుంది. సాధారణంగా.. ఇంజన్లకు కుడి లేదా ఎడమ వైపు చాంబర్ నుంచి ఇంధనం అందుతుంటుంది. ఒకవేళ ట్యాంక్ మధ్య చాంబర్‌లో పంచదార, ఇసుక వంటి పదార్థమేదైనా కలిస్తే.. ఇంజన్లు తొలుత మామూలుగానే ప్రయాణిస్తాయి. ఎందుకంటే.. అవి కుడి, లేదా ఎడమ వైపు చాంబర్ నుంచి ఇంధనం తీసుకుంటాయి కాబట్టి. వాటిలో ఒకటి ఖాళీ అయ్యాక.. మధ్య చాంబర్‌లో నాజిల్‌కు ఇసుక అడ్డంపడ్డప్పుడు.. ఇంజన్లకు ఇంధన సరఫరా ఆగిపోతుంది. దాంతో అవి పనిచేయటం ఆగిపోతాయి.

ఫలితంగా చాపర్ కిందకు పడిపోతుంది. అలాగే.. చాపర్‌లో టెయిల్ రోటర్, సెంట్రల్ రోటర్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలు చాలా సున్నితమైనవి. ఎవరైనా స్వల్పంగా టాంపరింగ్ చేసినా (ఏదైనా పరికరాన్ని పాడు చేసినా).. గాలిలో ప్రయాణించేటప్పుడు ఏమైనా జరగొచ్చు.


వైఎస్ గట్టిగా కేకలు వేసినట్లు సీవీఆర్‌లో ఉందన్న కథనాల గుట్టేమిటి?
హెలికాప్టర్ దుర్ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టి.. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న సీవీఆర్‌ను విశ్లేషణ కోసం విదేశాలకు పంపించింది. దుర్ఘటన జరిగిన తర్వాత దాదాపు రెండు నెలలకు రెండు ప్రముఖ తెలుగు టీవీ చానళ్లలో సంచలనాత్మక కథనాలు ప్రసారమయ్యాయి. సీవీఆర్‌లో సంభాషణలు తమకు తెలిశాయని ఆ చానళ్లు పేర్కొన్నాయి. ఘటన జరగటానికి కొద్ది నిమిషాల ముందు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పెద్ద పెద్దగా కేకలు వేసినట్లు సంభాషణల్లో వినిపించిందని చెప్పాయి.

పైలట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనీ పేర్కొన్నాయి. అయితే.. రెండు, మూడు గంటల పాటు ఈ కథనాలను ప్రసారం చేసిన ఆ చానళ్లు ఆ తర్వాత ఈ అంశంపై మౌనం దాల్చాయి. దీని అర్థం ఏమిటి? ఆ చానళ్లకు సీవీఆర్‌లోని సంభాషణలు అందాయా? అవి ప్రసారం చేసిన కథనాల్లో వాస్తవమెంత? ఆ వెంటనే ఆ చానళ్ల గొంతులు ఎందుకు మూగబోయాయి? తెర వెనుక ఏం జరిగింది?



కాంగ్రెస్ ఎంపీ ల్యాప్‌టాప్‌లోకి సీవీఆర్ రికార్డు ఎలా వచ్చింది?
హెలికాప్టర్ దుర్ఘటనకు సంబంధించి సేకరించిన శకలాలు, ఆధారాలు అన్నీ.. దేశంలో పౌర విమానయానాన్ని పర్యవేక్షించే, దానికి సంబంధించిన దుర్ఘటనలను పరిశోధించే డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధీనంలోనే ఉంటాయి.

అవి ఇతరుల చేతుల్లోకి వెళ్లటం నిబంధనలకు విరుద్ధం. ఆ హెలికాప్టర్ సీవీఆర్‌లోని సంభాషణలను తమకు అందించాలని.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు, పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్‌కు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు.

అయితే.. అలా సంభాషణల కాపీ అందించటం సాధ్యం కాదని ఆయన స్పష్టంచేశారు. ఢిల్లీ వస్తే.. డీజీసీఏతో మాట్లాడి.. ఆ సంభాషణలను వారికి వినిపిస్తామని చెప్పారు. అనుమానాస్పద దుర్ఘటనలో ఒక వీవీఐపీ మరణిస్తే.. సదరు వీవీఐపీ కుమారుడు, స్వయంగా ఎంపీ కూడా అయిన జగన్‌మోహన్‌రెడ్డికి.. ఆ సంభాషణల కాపీని ఇవ్వటానికి నిరాకరించారు. సీన్ కట్ చేస్తే.. ‘సీవీఆర్ సంభాషణలు నా ల్యాప్ టాప్‌లో ఉన్నాయి.. వస్తే వాటిని వినిపిస్తా’ అని కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇటీవల బాహాటంగా ప్రకటించారు.

అత్యంత పకడ్బందీగా నిబంధనలు పాటిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ, డీజీసీఏ చెప్తుండగా.. ఒక కాంగ్రెస్ ఎంపీ ల్యాప్‌టాప్‌లోకి సీవీఆర్ సంభాషణల టేపు ఎలా వచ్చింది? సాక్షాత్తూ వైఎస్ కుమారుడైనా, తానూ ఎంపీ అయినా.. ఆయనకు అందించటం సాధ్యం కాని సంభాషణల కాపీ.. ప్రభుత్వంలో, అందునా విమానయాన శాఖతో ఏ సంబంధమూ లేని ఒక సాధారణ ఎంపీ చేతికి అలా అందాయి? దీని వెనుక మర్మమేమిటి?



ఆ మేఘాలు లేవని తేలింది కదా?
దట్టమైన క్యుములోనింబస్ మేఘాల్లో ప్రయాణించటం వల్ల, ఆ మేఘాల్లో ‘డౌన్ డ్రాఫ్ట్’ (కిందికి వీచే ఈదురుగాలుల) వల్ల హెలికాప్టర్ ప్రమాదానికి గురయిందన్నది డీజీసీఏ, సీబీఐ దర్యాప్తు సంస్థల వాదన. అయితే.. దుర్ఘటన జరిగిన రోజు ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకూ వాతావరణ పరిస్థితులకు సంబంధించిన సి-బ్యాండ్ రాడార్ చిత్రాలను ‘సాక్షి’ సేకరించింది. నిపుణుల ద్వారా వాటిని విశ్లేషించింది. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఘటనా స్థలాన్ని గుర్తించి చూస్తే.. ఆ ప్రాంతంలో క్యుములోనింబస్ మేఘాలే లేవన్నది తేటతెల్లమయింది.

హెలికాప్టర్ దుర్ఘటన జరిగిన ప్రాంతానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో కుడివైపుకు ఈ క్యుములోనింబస్ మేఘాలు ఉన్నాయని.. వాతావరణ శాఖలో డెరైక్టర్‌గా పనిచేసి రిటైర్ అయిన నిపుణుడు ఒకరు స్పష్టంచేశారు. అయితే.. సాధారణ వర్షాన్నిచ్చే మేఘాలు మాత్రం ఉన్నాయి. దుర్ఘటన స్థలం కూడా ఈ మేఘాల చివరన ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. అయినా.. ఈ మేఘాల్లో ‘డౌన్ డ్రాఫ్ట్’ (కిందికి వీచే ఈదురుగాలులు) ఏర్పడే అవకాశం ఏమాత్రం లేదని తేల్చిచెప్పారు.

చిత్రమేమిటంటే.. సీబీఐ కూడా ఇవే చిత్రాలను తన నివేదికలో పొందుపరిచి.. ఘటనా స్థలం దగ్గర్లో క్యుములోనింబస్ మేఘాలు ఉన్నాయని పేర్కొంది. ఆ చిత్రాల్లో కూడా ఘటనా స్థలం ఓ పక్కకు ఉన్నట్లు చూపుతూనే.. ఈ మేఘాల వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని బలంగా అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది. ఎందుకిలా తిమ్మిని బమ్మిని చేస్తున్నారు? .


27 comments:

  1. Happy to know it is more than an accident.. That fellow would have left scot free for his sins if alive on earth..

    ReplyDelete
  2. YSR's chopper crashed in 2009, why Sakshi is bringing this up now? During every election season should people watch this drama?

    ReplyDelete
  3. అసలు y.s.r హత్యకు గురి అవ్వడము అంటూ జరిగిందంటే ఖచ్చితంగా జగనే చేయించుంటాడు...

    ReplyDelete
    Replies
    1. This is what I always say to my frns. Every other person knows how danger it is if they miss hitting him. YSR can only spare his own blood.

      Delete
  4. God is great !

    ReplyDelete
  5. moreover Brahmananda Reddy is head of Aviation , who is very close to YSR and his family and presently in jail.
    Its all baseless allegations. Everybody knows, how YSR tried to supress Hindu culture and Hindu temples. I know how many conversions happened in coastal area when he as Chief minister.
    God has punished him what he had done.
    :Proud Hindu Venki

    ReplyDelete
    Replies
    1. true friend, oka raakshasudu nasinchinanduku chaalaa anandam ga undi. Vaadi koduke ee pani cheyinchedu ani chaalaa mandi antunnaaru. Thandri chachina baadha yemaatram ledu john mohan alias fake reddy ki. Thandri savam pakkana pettukoni santhakaala sekarana jaripina neechudu. Assalu matter entante, samuel alias fake reddy john dhana kaanksha tho yenni thappudu panulu thana cheta cheyinchedo aalochinchi, pratipakshaalu avineethini astram ga maluchukovatam thattukoleka john ni hecharinchedu ta. Nee dhana kaanksha tagginchukomani. Adi manasulo pettukoni thandri ne lepesthe motham cm padavi, state lo dopidi rendu saadhyapadataayi ani brahmananda reddy tho kalisi kutra pannedu ani talk. Nijaalu nilakada ga telustaayi.

      Delete
  6. Y Sashi TV not telling his thing to public. The common public must know this. Please publish this in sashi please

    ReplyDelete
  7. One part mental 4 part innocence is Jagan is what these sambhar people think
    but 1 part mental 1 part rowdy 3 part villan is the truth.

    ReplyDelete
  8. The above Story is FAKE and Whenever they need people sentiment for Politics or Votes They will play this.... Poor AP people will Vote for this guys, because thy don’t know they are diverting people and earning money through the AP politics...

    Below is the 200% true Story :

    This Paper and News Channel both are come into Market with Side roads and they are writing some stories...

    YS Rajareddy was coming to Tirupathi and he Karunagar Reddy father called him to home and arranged party. In Party he saw Karunakarar reddy Mother and desided to enjoy with her.... Later he acted and came with relation story, so that no one will get doubt about him. Then Started enjoying with her and he use to stay long time in that House. Finally she got Pregnant and gave birth to Karunakar Reddy. This is not fake Information and 200% true that Karunakar Reddy Mother is fucked by Rajareddy.
    Below is the proof:
    1. Both Rajashakar reddy and Karunakar reddy looks same.
    2. Their Walking style and talking style is same
    3. Look their Eyes 200% same
    4. Rajashaker reddy himself told indirectly he is my own brother
    5. Karunakar reddy also confirmed and accepted the story indirectly when he talked about YS at the time of TTD chairmen

    Can Someone Or YSR Paper and TV say the below story is wrong? ?? If you need any clarification mail me @ jaganys@gmail.com

    ReplyDelete
    Replies
    1. Dude Wats Wrong in Karunakar Reddy Being Son Of RajaReddy . Does It Effect you in anyways ?Asshole you Guys are Tell me one politician who hasnt got a Bad Quality in Him . A leader need to Satisfy every one now a days as we select our leader not by his Character ,They re selected by Caste Politics , Favourisms And Pseudo Promises .

      The only Leader who fulfilled his Promises is THE GREAT YSR irrelative of Consequences .
      AnyReligion is a Religion Any Religion teaches about Humanitiy .Its Only Us who misunderstands Every Thing .

      The Only thing we have to Do Now Choose The Best And Dynamic .

      Delete
    2. anonymous, yes any religion is one and the same in preachings, we don't have anything specific against any religion. But do you accept if any hindu who is dead against jesus christ is made chairman of any reknowned church or masjid and allowed to loot its funds and encourage religious conversions from xtianity to hinduism? An xtian, radical, who once openly said that he will hit lord balaji's murti(he called it a black stone) with a chappal if he is allowed inside the temple. A person who is dead against lord balaji and hinduism an xtian radical, how come he be allowed to become a chairman of most pious hindu org like ttd? It is not at all acceptable to majority hindus.

      Delete
  9. అన్ని కామెంట్స్ అజ్ఞాతలే పెట్టారు. దీని భావమేమీ?

    ReplyDelete
  10. amruthabhandam గారూ..
    నా మనసులోని మాట చెప్పడానికి వీలు కల్పించేరు. వీరు అవినీతి పరులని గొంతు చించుకుంటున్న వై.ఎస్. ఆర్ , వై.ఎస్. జగన్లకు మద్దత్తు ఇస్తూ వ్రాస్తున్న నేను స్వంత పేరు -ఫోటో పెట్టి వ్రాస్తున్నా. కాని వారిని అవినీతి పరులని చెప్పేవారు మాత్రం అనానీలుగా కమెంట్స్ వేస్తున్నారు.

    నేను ఏం చెబుతున్నానో నా మాటల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టే నేను స్వంత పేరుతో ఫోటోతో వ్రాస్తున్నా. కాని వారు ఏమంటున్నారో వాటి పై వారికే విశ్వాసం లేదు అందుకే ఈ ముసుగులో గుద్దులాట

    ReplyDelete
  11. i put my name
    : proud hindu venki.
    vaatiki vivarana iste baguntundki

    ReplyDelete
  12. meru jagan abimani kabatte meeku pai story nijam anipisthondhi.oka vela adhi kutra ayyunte adhi jagan ne chesi vuntadu. urgent ga CM ayyipovalane athrame sontha nannanu kuda champinchuntadu.

    ReplyDelete
    Replies
    1. IPPATI KINAA cm RACE KI VAALLA FAMILY LO ADDOCHINA EVARININAA LEPESTAADU JAGAN ANY DOUBTS......Already vaalal babayi needa elaa behave chesaadu ..YSRCP lo join avavnanduku andari ki telusu......elaanti strories raapinchaadu paper lo...janaala to elaa godava cheyinchaadu......asalu MP avavatani ki entha godava chesaadu first lo......

      Naa korika entante...Viajaya CM avaaali...appudu telisidhi YSJ nija swaroopam....

      Delete
  13. చాలా చెత్త పోగుచేసారు.నీ రాజన్నది ఆత్మహత్యే కాని హత్య కాదు.అన్ని వ్యవస్ఠలను నాశనంచేసి రైల్వే సర్విస్ కు చెందిన బ్రహ్మానందరెడ్డిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి చావుకొని తెచ్చుకున్నాడు.ఇన్ని అనుమానాలు ఉంటే విజయ పులివెందులనుంచి హస్తం గుర్తుమీద ఎందుకు పోటీచేసింది?జగన్ పార్లమెంట్ లో ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదని ఆ కుటుంబానికి కుక్కలాంటి,అదే విశ్యాసపాత్రుడైన ఉండవల్లి ప్రశ్నించాడు .మీ బ్లాగులో రాముడ్ని రావణుడిని సమానంగా చూపించడం తెలుగు జాతికే సిగ్గుచేటు.సాంబారుగాడికి తెలుగుజాతిని అవమానించే అర్హత లేదు.మీ బ్లాగ్ లో రామారావు గారి ఫొటో వెంటనే తీయకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సివస్తుంది.

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్యా.. జ్యోతి ప్రకాష్ గారూ . మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు . ఇక మీ కమెంటులోని ప్రతి అక్షరానికి నా సమాధానం ఇదిగో :

      //చాలా చెత్త పోగుచేసారు.//
      ప్రోగు చేసింది నేను కాదు + ఇవి చెత్తా కాదు. చెత్తనిపిస్తే మీ మైండ్ అంతా అదే ఉన్నట్టు

      //నీ రాజన్నది ఆత్మహత్యే కాని హత్య కాదు//
      ఒక కోణంలో చూస్తే మీ పాయింట్ కరెక్ట్. ప్రస్తుతం కిరణ్ కుమార్లా కాచుక్కూర్చుని ఎవడో తన రెక్కల కష్ఠంతో పార్తిని అధికరానికి తెస్తే దొంగ రిపోర్టులిచ్చి అదిష్థానం మెప్పు పొంది లాటరి పైజు ల స్.ఎం పదవి పొందవచ్చ్న్ ఉండక పాద యాత్ర మొదలు పెట్టడం ఒక ఆత్మ హత్యాయత్నం.

      పోని పదవి దక్కాక హమ్మయ్యా ఇక 4 1/2 సం.లకు భయం లేదని అదిష్ఠానం సేవలో తరించి చివరి 6 నెలలు "బొమ్మ" చూపించి ఉంటే సరిపోయేది. కాని మా రాజన్న ప్రతి సం.న్ని ఎన్నికల సం.గా భావించి పని చేయడం ఒక ఆత్మ హత్యా యత్నం.

      సోనియాకు భజన చేసుకుని ఇతర "దద్దమ్మల్లా" ఉండి పోకుండా పేరు ప్రఖ్యాతలు గడించడం ఒక ఆత్మ హత్యా యత్నం

      రిలయన్స్ వారు "దిల్లి" లెవల్లో అవగాహణ కుదుర్చుకుని గ్యాసంతా దోచుకు పోవాలని చూస్తే అడ్డుకోవడం ఒక ఆత్మ హత్యా యత్నం.

      సరి కొత్త అగస్తాకు బదులు డొక్కు చాపర్ని ఉంచితే దాన్ని ఎడం కాల్తో తన్ని రచ్చబండ వాయిదా వేసుకోక పోవడాం -అక్కడ నా ప్ర్జజలు కాచుకు కూర్చున్నారు నేను వెళ్ళాలి అని బయలు దేరడం ఒక ఆత్మ హత్యా యత్నం

      //.అన్ని వ్యవస్ఠలను నాశనంచేసి//

      ఎంతగా నాశనం చేసాడో రాజన్న రాజ్యంలో చూసాం . అదిష్ఠానం ప్రత్యక్ష పర్యవేక్షణలో రోశయ్య కిరణ్ ఎంతగా బాగు చేసారో కూడ చూసాం.

      // రైల్వే సర్విస్ కు చెందిన బ్రహ్మానందరెడ్డిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి చావుకొని తెచ్చుకున్నాడు.//
      బ్రహ్మానంద రెడ్డి ఇందనపు చాంబర్లో చెక్కర పోయలేదుగా ..

      //ఇన్ని అనుమానాలు ఉంటే విజయ పులివెందులనుంచి హస్తం గుర్తుమీద ఎందుకు పోటీచేసింది?//
      పాండవులు ఐదూళ్ళు అడిగింది అవి చాలని కాదు. కౌరవులు వాటిని సైతం ఇవ్వట్లేదని ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చెయ్యడానికే .

      పులివేందులలో జగన్ని ప్రపోస్ చేసి ఉంటే లక్షలాది వై.ఎస్. అభిమానుల మనోభావాలను గౌరవించి -భవిష్యత్తులోనన్నా జగన్ని సి.ఎం చేస్తారని అర్థం.

      విజయమ్మ ప్రపోస్ చేసారంటే వారికి ఆ ఉద్దేశమే లేదని అర్థం. ఇవన్ని కంటికి కట్టినట్టు తెలిసినా పార్టి సూచనను పాటించింది "తమ పై పార్టి సూచనలు తిరస్కరిస్తున్నారన్న అపనిందలు రాకూడదనే"

      అనుమానం ఆకాశంలో నుంచి పెద్ద వృక్షంలా ఊడిపడదు. ముందుగా ఒక విత్తనం పడుతుంది. మెల్ల మెల్లగా మొలకెత్తుతుంది. ఇలా పరిణామాలను పట్టి -సంఘఠణలను పట్టి అనుమానం పెరుగుతూ పోతుంది

      //జగన్ పార్లమెంట్ లో ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదని ఆ కుటుంబానికి కుక్కలాంటి,అదే విశ్యాసపాత్రుడైన ఉండవల్లి ప్రశ్నించాడు//

      ఉండవల్లి వై.ఎస్.పక్షాన ఉన్నంత కాలం శివయ్య శిరస్సు పై చంద్రుడిలా వెలిగాడు .ఇప్పుడేమో "కుక్క" అనిపించుకుంటున్నాడు .అది వై.ఎస్. గొప్పతనం.

      బై ది బై .. జగన్ పార్లెమెంటులో లేవనెత్తితే "స్వంత గోడు" అంటారు. అందుకే ఆయన సువివరంగా లేఖ వ్రాసారు.

      //.మీ బ్లాగులో రాముడ్ని రావణుడిని సమానంగా చూపించడం తెలుగు జాతికే సిగ్గుచేటు//
      ఇంతకీ ఇప్పుడు భయిట పడ్డారన్న మాట . మీ పేరు వెనుక ఏదో ఒక తోక ఉంది. ఆ తోక ఏమని కూడ అర్థమయ్యేలా చేసేసారు. థ్యాంక్స్.

      రామన్నకు రాజన్నకు ఉన్న సైద్దాంతిక పరమైన పోలికలను ఎంతో లోతుగా విశ్లేషించి నేను వ్రాసాక కూడ మీరు ఈ మాట అంటున్నారంటే ఒకటి నా పాత టపాలు మీ కంట పడి ఉండక పోవచ్చు. లేదా మీ పేరు వెనుక ఒక తోక ఉంటుంది. ఏమ్ ఐ రైట్?

      //.సాంబారుగాడికి తెలుగుజాతిని అవమానించే అర్హత లేదు//

      సమకాలీన రాజకీయ చరిత్రను పరిశీలిస్తే రామన్న రాజన్న ఇద్దరు రెండు కళ్ళు వంటివారు. ఏ ఒకరిని కాదన్నా నష్ఠ పోయేది తెలుగు జాతియే

      // .మీ బ్లాగ్ లో రామారావు గారి ఫొటో వెంటనే తీయకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సివస్తుంది.//

      యువార్ ఆల్వేస్ వెల్కమ్. అలాగే ఎన్.టి.ఆర్ భవన్లోని ఎన్.టి.ఆర్ విగ్రహాన్ని కూడ తొలగించమనండి. చికెన్ సెంటర్లో గాంథి తాత పఠంలా అదెందుకు అక్కడ.

      ఎన్.టి.ఆర్ని వెన్ను పోటు పొడిచి -అతనికి గుండె పోటు తెప్పించిన చంద్రబాబు ఫోటో ప్రక్కన ఎన్.టి.ఆర్ బొమ్మ ఉండొచ్చు.

      ఎన్.టి.ఆర్ శతృ శేషాన్ని "ఖతం" చేసి ఎన్.టి.ఆర్ మానవీయ పథకాలన్నింటిని మరింత పఠిష్ఠంగా అమలు చేసిన వై.ఎస్.ఆర్ ప్రక్కన ఉండ కూడదా?

      అదీ చూద్దాం. కనీశం కోర్టుల్లోనైనా ఇంకా న్యాయం మిగిలే ఉంది బ్రదర్.. ప్రొసీడ్ !

      Delete
  14. అలాంటిదే ఉంటే ఈ పాటికి దాన్ని క్యాష్ చేసుకోకుండా ఉంటాడా ఈ జగత్ కిలాడీ??అలాంటిది ఏం లేదని నిశ్చయంగా నమ్మొచ్చు...

    ReplyDelete
    Replies
    1. john mohan alias fake reddy congress lo undi, cm ayithe, peddaayana di accident annatlu,

      ade john cong nunchi bayatiki vochi vere party pettukonte, peddaayanadi kutrapooritamaina hatya anntlu prajalu nammaali(chevi lo puvvulu pettukonnantha kaalam)

      Delete
  15. మేమూ ఒకప్పుడు టీడీపీ కి వ్యతిరేకమే.... (కుల ప్రస్తావన తేకూడదు...తప్పటం లేదు ** జాతి పొగరు చూసి విసిగి) వైఎస్సార్ కి ఓటు వేసి... ఈ రోజు ఈ జగన్ చేస్తున్న అవినీతికి అసహ్యం వేసి చిరాకు పడుతున్నాం...బాబు చూపిన మార్గం లో జగన్ దూసుకు పోయాడంతే...ఈ అవినీతి వెధవల్ని ఈ భరత మాత బిడ్డలుగా మనమ్ భరించక తప్పదు!!!

    ReplyDelete
  16. బాబుని దించి అంత కంటే ఘోరమైన అవినీతి పరునికి తెరలేపాం...thats all!!!

    ReplyDelete
    Replies
    1. Avineeti ni ayinaa barinchochu...samaajapu morals ni naasanam chesthunaaru.....fuedal manstatvaanni.........tappu cheyatam hakku laaga ...avanni morals ki againt kaadu annatlu janaalni maarusthunaaru......ee madya janaalu andaroo choosthunna kotha pokada entante prati okkadu maamoolu janam koodaa "avunu thappu chestaam ....needenti"..antunaaru....vaadu cheyaledaa veedu cheyaledaa ani support chesukontunaaru....

      Delete
  17. ఒరేయ్ KVSV ,

    ఆపరా నీ నాటకాలు. ** కుల పిచ్చికే నీవు వేరొ వాడికి ఓటేసావు అంటే నీవు ఎంత దద్దమ్మ వో అర్ధం అవుతుంది. వేరే వాళ్ళ మీద దుష్ప్రచారం కోసం నీవు నీ సొంత కులాన్నే తిట్టుకుంటున్నావు. అసలు ఎటువంటి నేరం నిరూపించ బడకుండానే నీవు జగన్ మీద పడి అవినీతి పరుడు అని తీర్మానిన్చేస్తున్నావు. నిన్ను గజ్జి కుక్కలతో ***న నీకు సిగ్గు రాదు.నీ కుల గజ్జి ని సిల్క్ గుడ్డ కప్పి నాది ఫ్రెష్ అంటే నమ్మడానికి ఎవడూ లేదు ఇక్కడ. నువ్వు NFDB లో మాట్లాడే మాటలు, రామోజీ రావు,బల్లి గాడి మీద రాసే సొల్లు రాతలు ఎవరికీ తెలియవు అనుకుంటున్నావు . ఎల్లకాలం నీ నాటకాలు సాగవు.

    ReplyDelete
  18. ఈ kvsv గాడి ,పచ్చ ఎదవల ఆలోచన అంతా ఒకటే,
    ఎలా అయినా సరే తార్పుడు గాడు ,బొల్లి గాడిని అధికారం లోకి తీసుక రావడం. అప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళ తార్పుడు బిజినెస్ కి అడ్డం ఉండదు. అందుకే తెగ ఆరాటం పడుతున్నారు.

    ReplyDelete
  19. Why don't you analyse this using astrology.

    ReplyDelete