క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday 22 June 2012

చంద్ర బాల ఉధంతం - సత్యాలు - కుట్రలు


ఏ.బి.ఎన్ పుట్టు పూర్వోత్తరాల్లోకి వెళ్తే వెయ్యి ప్రశ్నలు వెయ్యాల్సి ఉంటుంది. నాకంత ఓపిక లేదుగాని సి.బి.ఐ జె.డి -క్రైం రిపోర్టర్స్ -చందబాల ఉధంతానికే నా ప్రశ్నలను పరిమితం చేస్తున్నాను.

వై.ఎస్.ఆర్ సి.పి వారికి కొన్ని పరిమితులుంటాయి. అలానే సాక్షి మీడియా వారికి కూడా. వారు కొన్ని విషయాలపై నంగి నంగిగా మాట్లాడి తీరాల్సిన పరిస్థితి . నాకైతే అవేమి లేవు .అందుకే సూటిగా ప్రశ్నిస్తున్నాను.

జె.డి.కాని, రాధాకృష్ణ కాని ,క్రైం రిపోర్టర్లుగాని ,చివరికి చంద్రబాల గారు కాని ఆ సెల్ ఫోన్ నెంబర్లు తమది కాదని కాని -సతరు కాల్స్ తాము చేసినవి కాదని కాని - రిజీవ్ చేసుకుంది తాము కాదని కాని చెప్పలేదు. అంటే కాల్స్ వెళ్ళిన మాట నిజం - రిజీవ్ చేసుకున్న మాట నిజం -మాట్లాడుకున్న మాట నిజం అన్నమాట.

ఈ నేపథ్యంలో నా ప్రశ్నలు :

1.రాధాకృష్ణ గారు .. !

చంద్రబాల వంటి సంఘ సేవకులు కోకొల్లలుంటారు కదా. వారిలో ఈ రెండు నెలల్లో మరెంతమంది -మీకు కాల్ చేసారు. మీరు ఎంతమందికి కాల్ చేసారు?

2.అమ్మా చంద్రబాల గారు !

కేవలం ఒక తొక్కలో ప్రోగ్రామ్ కోసమే అయితే ఒక స్టింగర్ని సంప్రదిస్తే సరిపోతుంది - మించి పోతే జిల్లా రిపోర్టరుకు చెస్తే ఖతం. కాని దాని కవరేజి కోసం కేవలం మీడియా ఎం.డిలతోనే మాట్లాడాల్సిన పరిస్థితి/దుస్థితి ఎందుకు ఆవురించిందో చెప్పగలరా? ఇంకెంత మంది మీడియా ఎం.డిలతో మాట్లాడారో చెప్పగలరా?

3.అమ్మా చంద్రబాల గారు !

లక్ష్మినారాయణ సారు మీ క్లాస్ మెట్ అన్నారు , మీ ఫ్యేమిలి ఫ్రెండ్ అన్నారు. మరి మీతో మరెంతో మంది క్లాస్ మెట్స్ ఉంటారుకదా? వారిలో ఎంతమందికి ఇలా వందల కొలది కాల్స్ చేస్తుంటారు? అలానే సారు వారు మరెంత మంది క్లాస్ మెట్స్ కి ఇలా కాల్స్ చేస్తుంటారు?

4.అయ్యా క్రైం రిపోర్టర్లూ !
మీ సెల్ నెంబర్లు సాక్షిలో ఫ్లాష్ అవ్వగానే మా ప్రైవసి పోయింది - మా ప్రాణానికి హాని వస్తుంది అని గగ్గోలు పెట్టారుకదా.. ఇటువంటి "క్లీష్థ "పరిస్థితిలో మీడియా ముందుకొచ్చి తమరిని తాము ప్రదర్శించుకున్నారే దీంతో మీ ప్రైవసి దొబ్బదా? మిమ్మల్ని టార్గెట్ చేసేవారికి పని తేలైకై పోదా?

5.రాధాకృష్ణ గారు !
జగన్ పుణ్యమా అంటూ క్విట్ ప్రోకో అన్న పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జెడికి -చంద్రబాలగారికి-మీకు మద్య అసంఖ్యాక ఫోన్ సంభాష్ణలు మొదలవ్వటానికి పూర్వం మూడు నెలల్లో ఎబిఎన్ మీడియాకి అంది వచ్చిన ప్రభుత్వ ప్రకటల మొత్తం ఎంతా? ఫోన్ సంభాష్ణ మొదలైన పిమ్మట మీ మీడియాకు వచ్చిన ప్రభుత్వ ప్రకటల మొత్తం ఎంతా?

6.అమ్మా చంద్రబాల గారు !
మీ సంఘసేవకు జెడిగారు సాయం చేసేవారని చెప్పారు కదా? ఆ సాయాలు ఏవి? చేసిన వారెవరు? ఆ చేసినవారు లక్ష్మినారాయణ అనే వ్యక్తి సిఫార్సు చేస్తే సాయం చేసారా? లేక అతను అత్యున్నత దర్యాప్తు సంస్థ జె.డి అన్న కారణం చేత సాయం చేసారా? ఇది అధికార దుర్వినియోగం కాదా?

7.రాధాకృష్ణ గారు !
క్రైం రిపోర్ల ప్రైవసి పోయిందని వారికి హాని కలుగుతుందని - ఒక మహిళ -ఒక గృహిణి -ఒక సంఘ సేవకురాలైన చంద్రబాలకు హాని కలుగుతుందని -వారి ప్రైవసి పోయిందని ముసలి కన్నీరు కారుస్తున్నారే .. జగన్ తో /జగన్ మీడియాతో మీకున్న ప్రత్యక్ష పోరులో వీరిని భాగస్వాములు చేయడం వల్లేగా వారి ప్రైవసి పోయింది ..వారి ప్రాణానికి హాని వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఈ ముక్క ఎందుకు అంగీకరించరు?

8.రాధాకృష్ణ గారు !

ఎక్కడో -ఏ కోసలోనో -ఏ పిచ్చి యెదవో జె.డికి ఫ్లెక్సిలు పెడితే పని కొట్టుకుని వార్తలు వ్రాసే మీరు - జె.డి వైకుంఠమునుండి దిగి వచ్చిన కల్కి అవతారుడని కీర్తించే మీరు ఒక దర్యాప్తు అధికారిగా ల.నా కేసు వివరాలను మీడియాతో పంచుకోవడం - అదీ తన స్వంత నెంబరునుంది కాల్స్ చేసి మరి పంచుకోవడం క్రిమినల్ ప్రిసిజర్ కోడుకి విరుద్దమని -సి.బి.ఐ మేన్యువల్ కు విరుద్దమని - ఇప్పటికీ ఒక ముక్క కూడ చెప్పడం లేదే? పోని మీ కుమ్మక్కు జగమెరుగు. రేపు జె.డి సస్పెండ్ అయితే - విధులనుండి తొలగింప పడితే కాంగ్రెసులోనో -తె.దే.పాలోనో చేరడని హామి ఇవ్వగలరా?

9. అమ్మా చంద్రబాల గారు!
మీకు అన్యాయం జరిగిందని భావించారు. పైగా ప్రాణ హాని ఉందని భావించారు. ప్రాణ హాని ఉన్నవారు సాధారణంగా "రక్షణ" కోరుతారు. మీ నేపథ్యం చూస్తే " పరువునష్ఠ దావా" వేసే రకంగా కనిపిస్తున్నారు. మీ హై ప్రొఫైల్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆ పని చేసి ఉండవచ్చు. కాని హెచ్.ఆర్.సి కి మాత్రమే ఫిర్యాదు చేసారు. సాధారణంగా పోలీసు శఖను సంప్రదించి వారు న్యాయం చెయ్యకుంటేనే హెచ్.ఆర్.సి కి ఫిర్యాదు చేస్తారు. కాని మీరేమో కేవలం -హెచ్.ఆర్.సి కి మాత్రమే ఫిర్యాదు చేస్తారు. దీని ఆంతర్యం ఏమిటి?


రాధాకృష్ణ గారికి మనవి:

ఎంతకాదన్నా మీరో జర్నలిస్ట్ ఇప్పటికి కొన్ని ప్రోగ్రామ్స్ మీ జర్నలిస్ట్ ప్రతిభకు అద్దం పట్టే విదంగా ఉన్నాయి. కాదనను. గుడి మెట్లల్లో కూర్చున్న బిక్షగాడు పక్కవాడు లేకుంటే అన్ని చిల్లర డబ్బులు తనకే పడతాయని భావించినట్టుగా సాక్షి లేకుంటే జ్యోతి వెలిగి పోతుందని ఎలా అనుకుంటారు? బేసికల్గా మీరో జర్నలిస్ట్. రిపోర్టర్ అంటే "ఏం జరుగుతుందే దాన్ని రిపోర్టు చేసేవాడే రిపోర్టర్"

రిపోర్టు చెయ్యమంటే మీరే రంగంలోకి దూకి రంగు పులుముకుని "నేనుత్తముడ్నంటే ఉత్తముడ్ని" అని చంకలు గుద్దుకుంటే ఏం లాభం?

ఇప్పటికైనా మీలోని జర్నలిస్ట్ నిద్రలేవాలని - మీ జర్నలిస్ట్ ప్రతిభతోనే ఎ.బి.ఎన్ అభివృద్ది చెందాలని కోరుకుంటున్నా.

మీరెంతగా అరచి గీ పెట్టినా- ప్రజా భలం ముందు మీ ఎల్లో మీడియా కలలు కల్లలే అవుతాయి.తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా అత:పాతాళానికి తొక్కి వేయబడిన -మీలోని జర్నలిస్టును పైకి తేండి.. నా బోటివారు కూడ మెచ్చుకుంటారు

9 comments:

  1. (ఈ சித்தூர்.எஸ்.முருகேசன் అనేది cut & paste చేయగలనే గాని చదివి అర్థంచేసుకోలేనుగదా! అందుకే)సాంబారు గాడుగారూ. జగన్ బ్రాండ్ కళ్ళద్దాల్లోంచి ప్రపంచాన్ని చూసి వినోదించాలంటే, మీ టపాలు తప్పకుండా చదువ వలసినదే సుమా!

    ReplyDelete
  2. bolli gaadi kalladdallonchi pepenchaanni choodaalante ee kaamaleeyam sodaa buddi lonchi choodaali

    ReplyDelete
  3. శ్యామలీయం గారు మీరు బాబు అనుకూల, జగన్ వ్యతిరేక అద్దాలు తిసివేయల్సిన అవసరం లేదు . ఆ అద్దాలు పెట్టుకొనే ఈ పోస్ట్ లోని ప్రశ్నలకు సమాధానం చెప్పా వచ్చుకదా .. సాంబారు గారు కొన్ని ప్రశ్నలు సంధించారు మీ కళ్ళద్దాలతో చూసి ఎదుటి వారి గురించి అంటున్నారు అలా అనే బదులు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబితే బాగుంటుంది

    ReplyDelete
  4. orey..., ee aravam gaallani nammakoodadu, telugollu ante aravam vaallaki chulakana. chidambaram gaadu ee sambar gaadu okate telugu vaalla pathanaanni korukuntaaru. anduke jagan bhajana chesthunnaadu ee sambar gaadu.

    ReplyDelete
  5. క్షమించాలి. ఈ బ్లాగరుగారు జగన్ భజన చేయటం సుస్పష్టంగానే ఉంది. అది అర్థం చేసుకోవటానికి యెవరూ మేథావులు కానవుసరం లేదు. ఆయనే ఇల్లేక్కి చాటుకుంటున్న విషయమే అది.

    నేను ఈ టపాలోని భజన సమంజసంగా లేదని యెత్తి చూపటం మీలో కొందరకు నచ్చకపోవచ్చు. మీ కారణాలు మీ కుండవచ్చును. నాకేమీ అభ్యంతరం లేదు. కాని అవాచ్యాలకు దిగటం సభ్యత కాదని మనవి.

    ఇక పోతే, ఫలానివారికి అనుకూల లేద వ్యతిరేక జండాలు నా దగ్గరలేవు. విషయాన్ని బట్టి స్పందన. అంత వరకే. హాస్యాస్పదమైన టపాలో ప్రశ్నలకు అభ్యంతరం ఉన్నప్పుడు, అదితెలియజేసే వాళ్ళూ అంత పొడుగు వ్యాఖ్యనూ చేయాలని మీరనుకుంటే అది సరి కాదు. అసందర్భమైన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వ నవుసరంలేదు. అంతమాత్రం చేత యెవరి పక్షానో చేరిపోయినట్లు కాదు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు !
      మీ మాట అర్థమవుతూనే ఉంది.మీ మనసు గాయపడి ఉంటే క్షమించండి. ప్రశ్నలు వేయడం నా హక్కంటే - సమాదానం ఇవ్వక పోవడం "వారి" హక్కు. రాజీవ్ గాంథి సైతం "మొరిగె కుక్కలకు సమాదానం ఇవ్వనన్నారు" అందుకు స్పందించిన రాంజెఠ్మలాని "కుక్క దొంగలను చూసి మాత్రమే మొరుగుతుందన్నారు"

      ప్రశ్నించ బడిన వారి పై సమాదానం ఇచ్చే భాధ్యత ఉంటుంది కాని మీకా భాధ్యత లేదు.

      Delete
  6. gaadida guddemi kaadu saambaargaadu? Toilet paper sakshi chadivi chadivi nee burra pani cheyyatam maanesi untundi kaabolu.

    ReplyDelete
  7. sare..., ikkada vaadevado syamaleeyam gaari kalladdaalu nu alaa comment chesthe nuvvvu aa comment nu publish cheseventi kannaa... paapam syaamaleeyam garu feel avaroo..., thappu kadaa..., inkaa venakki velli ilaantivi vethakaalaa...? nannu koodaa ilaane comment chesthe nuvvu publish chesaavu. asalu aa ananymous comment needenaa... ani naa doubt.

    ReplyDelete